ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

గోవిందా మేనకోడలు క్తైస్తవ మతం తీసుకుందా?

 ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవిందా మేనకోడలు రాగిణి ఖన్నా ఓ టీవి నటి.సెలబ్రెటీలు మతాలు,కులాలు కూడా చర్చకు లోనవుతూంటాయి. ఈ క్రమంలో రీసెంట్ గా ఆమె మతం గురించి చర్చ మొదలై వైరల్ అయ్యింది. ఆమె హిందూ మతంలోంచి క్రైస్తవ మతంలోకి మారినట్లు వార్తలు వచ్చాయి. అయితే అలాంటిదేమీ లేదని ఆమె ఖండిచారు.   ప్రముఖ దినపత్రిక దైనిక్ భాస్కర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తాను క్రైస్తవ మతంలోకి మారలేదని చెప్పారు . తాను ఫేక్ న్యూస్ బాధితురాలిగా మారానని ఆమె పేర్కొంది . అదే క్రమంలో ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో అనుకోకుండా క్రైస్తవ మతంలోకి మారినట్లు పేర్కొన్న ఒక పోస్ట్‌ను షేర్ చేసినట్లు అంగీకరించింది, ఫలితంగా గందరగోళం ఏర్పడినట్లు పేర్కొంది. 'భాస్కర్ భారతి' స్టార్ పోస్ట్ ఫేక్ అని  తనకు తెలియదని పేర్కొంది. తన అభిమానులు చేసిన పోస్ట్‌లను తాను తరచుగా షేర్ చేస్తుంటానని , క్రియేట్ చేసిన వారి డిటేల్స్ ,కంటెంట్ చూసుకోకుండా చేయకుండా తాను అదే పని చేశానని నటి తెలిపింది . దీంతో ఆమె ఫేక్ న్యూస్ బాధితురాలిగా మారినట్లు చెప్పుకొచ్చింది.   ఓ అభిమాని తాను క్రైస్తవ మతంలోకి మారుతున్నట్లు ఫేక్ పోస్ట్ చేసి తన ఖాతాను ట్యాగ్ చ

గోవిందా మేనకోడలు క్తైస్తవ మతం తీసుకుందా?


 ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవిందా మేనకోడలు రాగిణి ఖన్నా ఓ టీవి నటి.సెలబ్రెటీలు మతాలు,కులాలు కూడా చర్చకు లోనవుతూంటాయి. ఈ క్రమంలో రీసెంట్ గా ఆమె మతం గురించి చర్చ మొదలై వైరల్ అయ్యింది. ఆమె హిందూ మతంలోంచి క్రైస్తవ మతంలోకి మారినట్లు వార్తలు వచ్చాయి. అయితే అలాంటిదేమీ లేదని ఆమె ఖండిచారు.

  ప్రముఖ దినపత్రిక దైనిక్ భాస్కర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తాను క్రైస్తవ మతంలోకి మారలేదని చెప్పారు . తాను ఫేక్ న్యూస్ బాధితురాలిగా మారానని ఆమె పేర్కొంది . అదే క్రమంలో ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో అనుకోకుండా క్రైస్తవ మతంలోకి మారినట్లు పేర్కొన్న ఒక పోస్ట్‌ను షేర్ చేసినట్లు అంగీకరించింది, ఫలితంగా గందరగోళం ఏర్పడినట్లు పేర్కొంది. 'భాస్కర్ భారతి' స్టార్ పోస్ట్ ఫేక్ అని  తనకు తెలియదని పేర్కొంది. తన అభిమానులు చేసిన పోస్ట్‌లను తాను తరచుగా షేర్ చేస్తుంటానని , క్రియేట్ చేసిన వారి డిటేల్స్ ,కంటెంట్ చూసుకోకుండా చేయకుండా తాను అదే పని చేశానని నటి తెలిపింది . దీంతో ఆమె ఫేక్ న్యూస్ బాధితురాలిగా మారినట్లు చెప్పుకొచ్చింది.

  ఓ అభిమాని తాను క్రైస్తవ మతంలోకి మారుతున్నట్లు ఫేక్ పోస్ట్ చేసి తన ఖాతాను ట్యాగ్ చేశాడని ఆమె పేర్కొంది.  నేను నా మత మార్పిడి గురించి మాట్లాడుతున్నానంటూ ఆ ఫేక్ పోస్ట్‌ను షేర్ చేశాడు.   సరే, నాకు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు, వారిలో ఒక వ్యక్తి ఇలాంటి తెలివితక్కువ పని చేస్తే, నా మొత్తం అభిమానుల సంఘాన్ని నేను నిందించలేను. నా అభిమానులను నేను  చాలా గౌరవిస్తాను” అని అన్నారు. “ ఏదైమైనా నటిగా, మనం మరింత జాగ్రత్తగా ఉండాలి, ఈ సంఘటన నుండి నేను నేర్చుకున్న పాఠం ఇదే.  ” అని ఆమె దైనిక్ భాస్కర్‌తో అన్నారు... సో ఈ వార్త అబద్దం.

కామెంట్‌లు